Chandrababu Naidu Arrested : చంద్రబాబుపై మరో కేసు బుక్ చేసిన ఏపీ సీఐడీ
X
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదైంది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతించారన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ బుక్ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదుచేసిన అధికారులు.. ఆయనను ఏ 3గా చేర్చారు. ఈ మేరకు అధికారులు ఏసీబీ కోర్టుకు ఎఫ్‌ఐఆర్ కాపీ సమర్పించారు. విచారణకు అనుమతించాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేయగా. ఏసీబీ కోర్టు అనుమతించింది.
మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చే విషయంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని ఏపీబీసీఎల్ ఎండీ కంప్లైంట్ చేశారు. 2 బేవరేజ్‌లు, 3 డిస్ట్రిలరీల కోసం 2012లో మద్యం పాలసీనే మార్చేశారని అందులో చెప్పారు. 2015లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వానికి పన్నులు రాకుండా చేశారని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే చంద్రబాబుపై కేసు పెట్టడంపై టీడీపీ నేతలు స్పందించారు. మద్యం పేరుతో మరో అక్రమ కేసు పెట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. టీడీపీ హయాంలో అక్రమాలు జరిగాయని నాలుగేళ్ల తర్వాత ఎందుకు కేసు పెట్టారని ప్రశ్నించారు. మధ్యంతర బెయిల్‌పై తీర్పు వచ్చే ముందురోజే గుర్తొచ్చిందా అని నిలదీశారు. జగన్ పాలనలో రూ. లక్ష కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.