Nara Lokesh: ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఐడీ.. పత్తాలేని లోకేష్ జాడ..!
X
ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నారా లోకేష్ కోసం ఏపీ సీఐడీ గాలిస్తోంది. ఈ కేసుకు సంబంధించి 41A సీఆర్పీసీ నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ నోటీసులు తీసుకోకుండా దాగుడుమూతలు ఆడుతున్నారని సమచారం. సీఐడీతో పాటు మీడియా కంటపడకుండా ఆయన తప్పించుకు తిరుగుతున్నారన్నవాదనలు వినిపిస్తున్నాయి.
నారా లోకేష్ శుక్రవారం వరకు ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్ లో ఉన్నారు. అయితే ఆ రూంను ఇప్పుడు ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆఫీసుగా ఉపయోగించుకున్న జయదేవ్ కంపెనీ గెస్ట్ హౌస్ లోనూ ఎవరూ పత్తాలేకుండా పోయారు. లోకేష్ రోజూ వాడే కారును పక్కనపెట్టి వేరే వాహనాల్లో తిరుగుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కాం కేసులో నారా లోకేష్ A14గా ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ సీఐడీ ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది.