Home > ఆంధ్రప్రదేశ్ > భౌతికంగా దూరంమైనా.. మనతో జీవించి ఉంటారు

భౌతికంగా దూరంమైనా.. మనతో జీవించి ఉంటారు

భౌతికంగా దూరంమైనా.. మనతో జీవించి ఉంటారు
X

ప్రజా గాయకుడు గద్దర్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘బడుగు, బలహీనవర్గాల విప్లవ స్పూర్తి గద్దర్‌. ఆయన పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణ కోసమే. గద్దర్‌ నిరంతరం సామాజిక న్యాయం కోసమే పోరాడారు. గద్దర్‌ మరణం ఊహించలేనిది. సామాజిక న్యాయ ప్రవక్తల భావాలు, మాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ మనతో జీవించే ఉంటాయి. గద్దర్‌కు తెలుగు జాతి సెల్యూట్‌ చేస్తోంది. గద్దర్‌ కుటుంబ సభ్యులకు మనమంతా బాసటగా ఉందా’మని జగన్ అన్నారు.

Updated : 6 Aug 2023 6:25 PM IST
Tags:    
Next Story
Share it
Top