Home > ఆంధ్రప్రదేశ్ > Skill Development Scam Case :స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే.. సీఎం జగన్

Skill Development Scam Case :స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే.. సీఎం జగన్

Skill Development Scam Case :స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే.. సీఎం జగన్
X

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన వైఎస్ఆర్ కాపునేస్తం సభలో జగన్ మాట్లాడారు. అరెస్టై జైల్లో ఉన్న ఒక మహానుభావుడు గురించి నాలుగు మాటలు చెబుతాను, ఆలోచన చేయాలని ప్రజలను కోరుతున్నాను అని జగన్ అన్నారు. ఎన్ని దొంగ తనాలు, దోపిడీ చేసినా, వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని రక్షించుకొనేందుకు పలుకుబడి కలిగిన తన దొంగల ముఠా సభ్యులు ప్రయత్నిస్తున్నారు. కానీ, చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవాళ్లు ఇంతకాలం లేరంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఒక మామూలు వ్యక్తి తప్పుచేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో.. అధికారంలో ఉన్నవారికికూడా అదే శిక్ష పడాలని చెప్పేవారు ఇంతకాలం లేరని అన్నారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారు

చంద్రబాబు నాయుడు పచ్చి అవినీతిపరుడని కామెంట్ చేశారు. ఆయన్ని కాపాడటానికి చాలా మంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారని వారికి కూడా ఈ అవినీతి, అక్రమాల్లో వాటా ఉందంటూ ఆరోపించారు. ఏపీలో జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంతో పాటు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లధనం ఇస్తూ అడ్డంగా దొరికిన వ్యక్తి చంద్రబాబు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్. ఆడియో, వీడియో టేపులతో సహా దొరికిన వ్యక్తి ఈయన కాదా అంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు చట్టం అందరికి ఒకటే అని చెప్పే చంద్రబాబు ..ఇప్పుడెందుకు అవినీతి కేసులో సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయారని కామెంట్ చేశారు.

ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు

‘‘లేని కంపెనీని ఉన్నట్టుగా ఫేక్ అగ్రిమెంట్ ‌సృష్టించి.. చంద్రబాబే ప్రభుత్వ నిబంధనలు పక్కకు పెట్టించాడు. ఒత్తిడి తీసుకొచ్చి సంతకాలు పెట్టి నిధులు దోచేశారు. స్కిల్‌ స్కాం సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని సీఐడీ నిర్ధారించింది. డబ్బును డొల్ల కంపెనీలకుఎలా మళ్లీంచారన్నది ఈడీనే బయటపెట్టింది. చంద్రబాబు పీఏ చాటింగ్‌లను ఐటీశాఖ బయటపెట్టింది. ఫేక్‌ అగ్రిమెంట్‌ దొంగలను ఇప్పటికే అరెస్ట్‌ చేసింది. సాక్ష్యాలు, ఆధారాలు చూసిన తర్వాత కోర్టు బాబును రిమాండ్‌కు పంపింది. ఇంత అడ్డగోలుగా దొరికిపోయినా కూడా ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అని బాబు అంటున్నారు. ఈడీ అరెస్ట్‌ చేసినా, ఐటీ నోటీసులిచ్చినా ఇంకా బుకాయిస్తున్నారు. కోర్టు రిమాండ్‌కు పంపితే ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అన్న పవన్‌ ప్రశ్నించడు. ఎల్లో మీడియా నిజాలను చూపించదు, వినిపించదు. చంద్రబాబు అవినీతిపై మాట్లాడదు. వాటాలు పంచుతాడు కాబట్టే వీరెవ్వరూ ప్రశ్నించారు. లంచాలు తీసుకుంటే తప్పేంటని చెత్తపలుకులు రాసేది ఒకడు, ములాఖత్‌లో మిలాఖత్‌ చేసుకొని పొత్తు పెట్టుకునేది ఇంకొకడు’’ అని సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.




Updated : 16 Sep 2023 7:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top