చారిత్రాత్మక నిర్ణయం.. ఆరోగ్యశ్రీ రూ.25 లక్షలకు పెంపు
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ.. పేద ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 25 లక్షల వరకు ఉచిత ట్రీట్మెంట్ అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన జగన్.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు చరిత్రాత్మక నిర్ణయం అన్నారు. వైసీపీ ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పేద ప్రజలకు విద్యా వైద్యం ఒక హక్కని.. అందుకే ఎలాంటి వైద్యమైనా రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుందని భరోసా నిచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జగన్.. ఈనెల 18 నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 19 నుంచి ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ఆరోగ్యశ్రీపై ప్రజలకు అవగాహన ఇవ్వాలని కోరారు. మండలంలో వారానికి నాలుగు గ్రమాల చొప్పున ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. జనవరి నెలాఖరు నాటికి ఈ కార్యక్రమం పూర్తి కావాలని సీఎం ఆదేశించారు