Home > ఆంధ్రప్రదేశ్ > రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. సీఎంకు అస్వస్థత

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. సీఎంకు అస్వస్థత

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. సీఎంకు అస్వస్థత
X

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న జగన్ ట్రీట్మెంట్ తీసుకొంటున్నారు. రేపటి నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఇవాళ (సెప్టెంబర్ 20) కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం సీఎం అపాయింట్మెంట్లన్నీ అధికారికంగా రద్దుచేశారు. ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. కేబినెట్ సమావేశం అనంతరం జగన్.. అసెంబ్లీ సమావేశాల వ్యూహాలపై చర్చించేందుకు పలువురు ముఖ్య నేతలతో సమావేశం అయినట్లు తెలుస్తుంది. ఏపీ మంత్రులు బుగ్గన, బొత్స, పెద్దిరెడ్డిలతో పాటు ప్రభుత్వ విప్ లు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

Updated : 20 Sept 2023 3:51 PM IST
Tags:    
Next Story
Share it
Top