Home > ఆంధ్రప్రదేశ్ > దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్.. విశాఖ రూపురేఖలు మారతాయి.. జగన్

దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్.. విశాఖ రూపురేఖలు మారతాయి.. జగన్

దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్.. విశాఖ రూపురేఖలు మారతాయి.. జగన్
X

విశాఖపట్నమే ఏపీ రాజధాని అంటున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నగరంలో పలు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దేశంలోనే అతి పెద్దదైన ఇనార్బిట్ మాల్‌ సహా పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. వీటి విలువ రూ. 864 కోట్లు. విశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, నగరం అంతర్జాతీయ చిత్రపటంలో ప్రత్యేక స్థానం పొందుతుందని ఆయన అన్నారు. ‘‘ఏపీ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోంది. ఈ మాల్ పూర్తయ్యాక నగర ప్రతిష్ట పెరుగుతుంది. మన సిటీ ఇంటర్నేషనల్ సిటీ అవుతుంది. ఇనార్బిట్ మాల్ ద్వారా వేలమందికి ఉపాధి లభిస్తుంది ’’ అని ఆయన అన్నారు. రూ.135.88 కోట్లతో జీవీఎంసీ చేపడుతున్న పలు ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఏయూ క్యాంపస్‌లో రూ.21 కోట్లతో నిర్మించనున్న స్టార్టప్‌ టెక్నాలజీ ఇంక్యుబేషన్‌ హబ్‌కు సీఎం భూమిపూజ చేస్తారు. 2025 నాటికి 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద ఇన్నొవేషన్‌ హబ్‌గా రూపొందించాలన్నది దీని లక్ష్యం.

ఇనార్బిట్ మాల్ ప్రత్యేకతలు..

• రహేజా గ్రూప్ కంపెనీ 17 ఎకరాల విస్తీర్ణంలో మూడు దశల్లో ఈ మాల్ నిర్మిస్తుంది. 2026 నాటికి పూర్తి చేస్తారు. విశాఖ పోర్టు అథారిటీ నుంచి ఈ స్థలాన్ని 30 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు.

• మొత్తం రూ.600 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. పార్కింగ్‌ కోసమే 4 లక్షల చదరపు అడుగుల స్థలం కేటాయించారు.

• 250కిపైగా అంతర్జాతీయ బ్రాండ్ల షాపులు ఈ మాల్లో ఉంటాయి. 8వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దక్కుంది.

• ప్రాజెక్టు రెండో దశలో ఐటీ క్యాంపస్‌ నిర్మిస్తారు. 3 వేల మంది విధులు నిర్వహించడానికి 2.5 లక్షల చదరపు అడుగుల్లో హబ్ ఉంటుంది.

• ప్రాజెక్టు మూడో దశలో 200 గదులతో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నిర్మిస్తారు. విశాఖలో పర్యాటకాన్ని పెంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.





Updated : 1 Aug 2023 1:35 PM IST
Tags:    
Next Story
Share it
Top