Home > ఆంధ్రప్రదేశ్ > జగన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం..

జగన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం..

జగన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం..
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కారును ఓ కారు ఢీకొట్టింది. త్రుటిలో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. శుక్రవారం కడప జిల్లా వేముల నుంచి ఇడుపులపాయ ఎస్టేట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేములలో పార్టీ సమావేశం ముగించుకుని వస్తుండగా కాన్వాయ్‌లో జగన్ కారు వెనకున్న వాహనం అదుపు తప్పి ఆయన కారను ఢొకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల ఇండికేటర్లు దెబ్బతిన్నాయి. సీఎంను మరో వాహనంలో ఇడుపులపాయకు తీసుసుకెళ్లారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. రెండు రోజుల జిల్లా పర్యటనలో ఆయన అభివృద్ధి పనులను సమీక్షించారు. రెండు పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు.


Updated : 10 Nov 2023 9:45 PM IST
Tags:    
Next Story
Share it
Top