లండన్ నుంచి విజయవాడ వచ్చేసిన జగన్..
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. సతీసమేతంగా లండన్ వెళ్లిన ఆయన మంగళవారం ఉదయం తిరిగి విజయవాడ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగిన సీఎం జగన్ దంపతులకు మంత్రులు, అధికారులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. దారిలో ఫ్లెక్సీలు కట్టి సందడి చేశారు. తర్వాత జగన్, భారతి తాడేపల్లిలో అధికార నివాసానికి రోడ్డు మార్గంలో వెళ్లారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో విపక్ష టీడీపీ నేత చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం, రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నడమ జగన్ విదేశీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ అక్కడి నుంచే పావులు కదిపి తమ నేతను జైల్లో వేయించారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. బాబు అరెస్ట్‌పై సీఎం ఎలా స్పందిస్తారని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. జగన్ ఇద్దరు కూతుళ్లు లండన్‌లో చదువుకుంటుండడం, వారిని చూడ్డానికి జగన్ దంపతులు కోర్టు అనుమితో అక్కడికి వెళ్తుండడం తెలిసిందే.
లండన్ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న సీఎం వైయస్ జగన్ pic.twitter.com/98GEXAf6kB
— YSR Congress Party (@YSRCParty) September 12, 2023