Home > ఆంధ్రప్రదేశ్ > జగన్ శ్రీవారి అక్షింతలు దులుపుకున్నారని రచ్చ! అసలేం జరిగింది?

జగన్ శ్రీవారి అక్షింతలు దులుపుకున్నారని రచ్చ! అసలేం జరిగింది?

జగన్ శ్రీవారి అక్షింతలు దులుపుకున్నారని రచ్చ! అసలేం జరిగింది?
X

తిరుమల శ్రీవారి ఆలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తల దులుపుకోవడంపై పెద్ద వివాదం రేగుతోంది. వేదపండితులు తన తలపైన వేసిన అక్షింతలను ఆయన దులిపేసుకున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళకరమైన అక్షింతలు ఆయనకు ఇష్టం లేదని సోషల్ మీడియాలో కొందరు మండిపడుతున్నారు. ఆయనకు హిందూ సంప్రదాయాలంటే గిట్టవని దుయ్యబడుతున్నారు. హిందువులకైతే అక్షింతల పవిత్రత అర్థం అవుతుందని కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఆయన అక్షింతలు దులుపుకోలేదని, జుట్టు సవరించుకున్నారని మరికొందరు అంటున్నారు. ప్రతిదానికి పెడార్థాలు తీయకూడదని వైసీపీ సోషల్ మీడియా అంటోంది. హిందూ సంప్రదాయాలపై గౌరవం లేకపోతే ఆయన అసలు గుడికే వెళ్లేవాడే కాదని వాదిస్తోంది. జగన్‌ తనకు వేదపండితులు చుట్టిన తలపాగాను తీసేశాక జుట్టును సవరించుకున్నట్లు వీడియోలో ఉంది. అయితే ఎక్కువ సేపు దువ్వుకోవడంతో అక్షింతలు దులుపుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, సీఎం తన సతీమణితో కలసి తిరుమలకు రావాలని ఇప్పటికే కొన్ని అతివాద హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. శ్రీవారికి సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించడం సంప్రదాయంగా వస్తోందని, కానీ జగన్ కొన్నేళ్లుగా దాన్ని పాటించకుండా తలబిరుసుగా వ్యవహరిస్తున్నారని మండిపతున్నాయి. ఈ నేపథ్యంలో అక్షింతలను తొలగించుకోవడం మరింత వేడి రాజేసింది.

Updated : 19 Sept 2023 9:54 PM IST
Tags:    
Next Story
Share it
Top