పవన్ కంటే బర్రెలక్క బెటర్ .. పవన్‌పై జగన్ పంచ్
X
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సటైర్లతో చెలరేగి పోయారు. పవన్ ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్ అని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్కను జగన్ మెచ్చుకున్నారు..
‘‘చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కల్యాణ్ పార్టీకి రాలేదు. అతడో ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్. తెలంగాణలో తాను పుట్టనందుకు తెగ బాధపడుతున్నానని పవన్ చెప్పాడు. తెలంగాణలో పుట్టకపోవడం తన దురదృష్టమన్నాడు. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానన్నాడు. ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజ్ స్టార్‌కు ఎన్నికల్లో దిక్కులేకుండా పోయింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్దమనిషి పార్టీకి రాలేదు. డిపాజిటే దక్కలేదు. పవన్, చంద్రబాబులకు వారి స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం. వారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ప్రేమ లేదు..’’ అని జగన్ దుయ్యబట్టారు.