లోబరుచుకోవడం..పెళ్లి చేసుకుని వదిలేయడం.. పవన్పై జగన్ ఫైర్
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. వాలంటీర్లు అమ్మాయిల్ని లోబర్చుకుంటున్నారని పవన్ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. అమ్మాయిల్ని లోబర్చుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం, కాపురాలు చేయడం, వదిలేయడం దత్తపుత్రుడి క్యారెక్టర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘ దత్తపుత్రుడు ఒకరిని పెళ్లి చేసుకుంటాడు. మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. అమ్మాయిలను లోబర్చుకుని వారిని పెళ్లి చేసుకుంటాడు. నాలుగేళ్లు కాపురం చేసి వదిలేస్తాడు అంటూ పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా నారా లోకేష్, చంద్రబాబు, బాలకృష్ణలపై కూడా జగన్ విరుచుకపడ్డారు. ‘‘ ఒక వ్యక్తి పట్టపగలే మందుకొడుతూ.. 10 అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్‌లో డ్యాన్స్ చేస్తాడు. మరో వ్యక్తి.. అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంటాడు.. లేకపోతే కడుపైనా చేయాలంటాడు. ఇంకో ఆయన.. ఆహా బావా నువ్వు సినిమాల్లోనే చేశావు.. నేను నిజజీవితంలో చేశాను అంటూ చేసిన వెధవ పనులను గొప్పగా చెప్పుకుంటాడు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి క్యారెక్టర్‌లేని వాళ్లంతా మంచి చేస్తున్న వాలంటీర్లు గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి చేస్తున్న వ్యవస్థలను, మంచి చేసే మనుషులనూ సంస్కారం ఉన్న ఎవరూ విమర్శించరన్నారు. వాలంటీర్లపై తప్పుడు మాటలకు స్క్రిప్ట్ రామోజీరావు, నిర్మాత చంద్రబాబైతే.. నటన, మాటలు దత్తపుత్రుడివి అంటూ సెటైర్ వేశారు. వాలంటీర్లు అందరికీ తెలిసిన వారేనని.. ఎండొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా.. వాళ్లు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు.