యూకే వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వండి- సీఎం జగన్
X
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టును ఆశ్రయించారు. యూకే వెళ్లేందుకు అనుమతించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 2న లండన్ లో చదువుకుంటున్న తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అందులో అభ్యర్థించారు. అందుకోసం అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు సడలించాలని ధర్మాసనాన్ని కోరారు. జగన్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ తరఫు న్యాయవాది కోర్టును సమయం కోరారు. దీంతో ధర్మాసనం కేసు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం పిటిషన్ దాఖలుచేశారు. యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ టూర్ కు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరడంతో విజయసాయిరెడ్డి పిటిషన్‌పైనా తదుపరి విచారణను న్యాయమూర్తి ఈనెల 30కి వాయిదా వేశారు.