రేపు పోలవరానికి సీఎం జగన్..
X
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం పర్యటనకు ముహూర్తం ఫిక్సైంది. ఈ నెల 6న (మంగళవారం) సీఎం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు . ఉదయం 10.15 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ అమరావతి నుంచి పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే హెలిప్యాడ్ సిద్ధం చేశారు. పర్యటనలో భాగంగా జగన్ పోలవరం ప్రాజెక్టు లోయర్, అప్పర్ కాఫర్ డ్యాంలను పరిశీలించనున్నారు. అలాగే స్పిల్‌వే, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ ప్రాంతాలను సైతం సందర్శించనున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టును సందర్శన అనంతరం ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులు, ఇంజినీర్లతో సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకోనున్నారు.
జగన్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇదిలా ఉంటే కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన ఇటీవలే పోలవరం ప్రాజెక్టు పనులపై కీలక సమావేశం జరిగింది. పోలవరం పనులను త్వరగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది.
కేంద్ర మంత్రితో మీటింగ్ లో భాగంగా పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రూ.17 వేల కోట్ల నిధులు విడుదల చేయాలని ఏపీ అధికారులు కోరారు. వారి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో నిధులను విడుదల చేస్తామని ఇచ్చినట్లు సమాచారం.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.