Home > ఆంధ్రప్రదేశ్ > YS Sharmila: కాంగ్రెస్‌లోకి షర్మిల.. హస్తంలో YSRTP విలీనం..

YS Sharmila: కాంగ్రెస్‌లోకి షర్మిల.. హస్తంలో YSRTP విలీనం..

YS Sharmila:  కాంగ్రెస్‌లోకి షర్మిల.. హస్తంలో YSRTP విలీనం..
X

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ(YSRTP)అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈరోజు(గురువారం) ఉదయం తన భర్త అనిల్‌తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న షర్మిల.. అక్కడ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్సాఆర్టీపీని హస్తం పార్టీలో విలీనం చేశారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... వైఎస్సాఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశానని, తనకు చాలా సంతోషంగా ఉందన్నారు."కాంగ్రెస్ కోసం నా తండ్రి వైఎస్సార్ జీవితాంతం పోరాటం చేశారు, కాంగ్రెస్ పార్టీలో ఎంతో పని చేశారు.ఆయన కూతురిగా నేను కాంగ్రెస్‌లో చేరుతున్నందకు గర్వకారణంగా ఉంది. నా తండ్రి వైఎస్సాఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నాను" అని చెప్పారు. దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్‌ది అని చెప్పిన షర్మిల.. దేశంలో కాంగ్రెస్ అతిపెద్ద సెక్యూలర్ పార్టీ అని, సెక్యూలర్ పార్టీ కేంద్రంలో లేనందువల్లే మణిపూర్ వంటి ప్రాంతాల్లో అల్లర్లు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ లేకుంటే అన్ని రాష్ట్రాల్లో మణిపూర్ పరిస్థితే ఎదురవుతుందన్నారు.

రాహుల్ గాందీ గురించి ప్రస్తావస్తూ.. రాహుల్ జోడో యాత్రతోనే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి కోరిక అని, ఆ కలను నిజం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ గెలుపు కోసమే తాను తెలంగాణలో పోటీ చేయలేదన్నారు. కాంగ్రెస్ తనకు ఏ బాధ్యత ఇచ్చినా పనిచేస్తానని, ఏపీలోనే కాదు అండమాన్‌లోనైనా కాంగ్రెస్ కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ఈ సందర్భంగా చెప్పారు షర్మిల.

Updated : 4 Jan 2024 5:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top