Home > ఆంధ్రప్రదేశ్ > CM JAGAN: విశాఖ నుంచే పరిపాలన.. ఏపీ సీఎం జగన్

CM JAGAN: విశాఖ నుంచే పరిపాలన.. ఏపీ సీఎం జగన్

CM JAGAN: విశాఖ నుంచే పరిపాలన.. ఏపీ సీఎం జగన్
X

త్వరలో విశాఖ నుంచే పాలన సాగించనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. డిసెంబరు లోపు విశాఖకు మారనున్నట్లు తెలిపారు. విశాఖ నుంచే పరిపాలన సాగబోతున్నట్లు చెప్పారు. సోమవారం విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించారు సీఎం జగన్ . ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలోనే తాను విశాఖకు షిఫ్ట్ అవుతానని చెప్పారు. తనతోపాటూ పరిపాలనా విభాగం అంతా విశాఖకు షిఫ్ట్ అవుతుందన్నారు. ఐటీ కంపెనీల రాకతో.. విశాఖ సిటీ లాండ్ స్కేప్ మారుతుందన్నారు.

హైదరాబాద్‌, బెంగళూరు మాదిరిగా విశాఖ ఐటీ హబ్‌గా మారబోతోందన్నారు. రాష్ట్రంలోనే విశాఖ అతిపెద్ద నగరమని, ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్‌ హబ్‌గా తయారైందన్నారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయని చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని, ఒక్క ఫోన్‌ కాల్‌తో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కంపెనీలకు కల్పిస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నం , అనకాపల్లి జిల్లాల పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా.. మధురవాడ ఐటీ హిల్ నంబర్ 2 దగ్గర ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభించారు. ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం.. విశాఖలో రూ.35 కోట్లతో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇందులో దాదాపు 1000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మరో రూ.1,624 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పలు ఐటీ, ఫార్మా కంపెనీలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నాయి.

Updated : 16 Oct 2023 1:07 PM IST
Tags:    
Next Story
Share it
Top