Home > ఆంధ్రప్రదేశ్ > YS Jagan Mohan Reddy : దుర్గమ్మకు గుడికి మహర్దశ.. .ఏకంగా రూ. 216 కోట్లతో..

YS Jagan Mohan Reddy : దుర్గమ్మకు గుడికి మహర్దశ.. .ఏకంగా రూ. 216 కోట్లతో..

YS Jagan Mohan Reddy : దుర్గమ్మకు గుడికి మహర్దశ.. .ఏకంగా రూ. 216 కోట్లతో..
X

ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువై కనక దుర్గమ్మ ఆలయాన్ని ఏపీ ప్రభుత్వం భారీస్థాయిలో అభివృద్ధి చేస్తోంది. భక్తులకు సకల సదుపాయాలు అందించేందుకు మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రూ. 216 కోట్లతో పనులు చేపట్టింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత వివిధ పనులకు శంకుస్థాపన చేశారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా అన్నప్రసాద భవనం, ప్రసాదం పోటు, కనకదుర్గ నగర్ నుంచి మహా మండపం వరకు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ ,రాజా గోపురం ముందు మెట్ల దారి. క్యూ కాంప్లెక్స్, మహా రాజద్వార నిర్మాణం, తలనీలాల హాలు, మల్టీ లెవల్ కార్ పార్కింగ్, గ్రానైట్ రాతి యాగశాల ఏర్పాటు చేస్తారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 70 కోట్లు మంజూరు చేసింది. మొత్తం రూ. 216 కోట్లలో రూ. 131 కోట్ల దేవస్థానం నిధులు కాగా, 5 కోట్లు దాతలే సమకూర్చారు. రూ. 33 కోట్లు ప్రైవేట్ భాగస్వామ్యం కింద అందాయి.

కేటాయింపులు ఇలా..

మల్లేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపనకు రూ. 5.60 కోట్లు

మల్లికార్జున మహామండపం క్యూ కాంప్లెక్స్ మార్పు పనులకు రూ. 18.37 కోట్లు

అమ్మవారి అన్నప్రసాద భవన నిర్మాణానికి రూ. 30 కోట్లు

ఇంద్రకీలాద్రి కొండ రక్షణ చర్య పనులకు రూ. 4.25 కోట్లు

తలనీలాల హాలు నిర్మానికి రూ. 19 కోట్లు

గోశాల అభివృద్ధి పనులకు రూ. 10 కోట్లు

కొండపైన పూజా మండపాల నిర్మాణానికి రూ. 7 కోట్లు

కొండపైన రాతి యాగశాల నిర్మాణానికి రూ. 5 కోట్లు

కనకదుర్గ నగర్ నుంచి మహామండపం వరకు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 17 కోట్లు

రాజగోపురం ముందు భాగాన మెట్ల నిర్మాణానికి రూ. 15 కోట్లు

మహామండపం వద్ద అదనపు క్యూలైన్ల ఏర్పాటు రూ. 23.50 కోట్లు

కనక దుర్గ నగర్ వద్ద మహారాజద్వారం నిర్మాణం రూ. 7.75 కోట్లు

కనకదుర్గనగర్‌లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్‌కు రూ. 33 కోట్లు

ఎల్టీ ప్యానల్ బోర్డులు, ఎనర్జీ వాటర్ తదితరాలకు రూ. 3.25 కోట్లు

మెగా సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు రూ. 5. 67 కోట్లు


Updated : 7 Dec 2023 11:53 AM IST
Tags:    
Next Story
Share it
Top