Home > ఆంధ్రప్రదేశ్ > విద్యార్థులకు గుడ్‌న్యూస్..రేపే 'జగనన్న విద్యా కానుక'

విద్యార్థులకు గుడ్‌న్యూస్..రేపే 'జగనన్న విద్యా కానుక'

విద్యార్థులకు గుడ్‌న్యూస్..రేపే జగనన్న విద్యా కానుక
X

ఏపీ విద్యార్థులకు శుభవార్త. స్కూళ్లు ప్రారంభమైన రోజునే 'జగనన్న విద్యా కానుక' అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని స్కూళ్లకు విద్యాకానుక కిట్లు చేరాయి. విద్యాకానుక పథకాన్ని సోమవారం పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం వైఎస్‌ జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. స్కూల్స్ రీ ఓపెనింగ్ రోజునే విద్యా కానుక అందిస్తామని..వేసవి సెలవులకు ముందుగానే ఏపీ సర్కార్ ప్రకటించింది.



ఈ పథకం కింద సుమారు 43 లక్షల మంది విద్యార్థులకు యూనిఫాం, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, బ్యాగ్, ఇంగ్లిష్, తెలుగు టెక్ట్స్‌ బుక్స్, వర్క్‌ బుక్స్, డిక్షనరీ, నోటు పుస్తకాలు అందించనున్నారు.ఈ ఏడాది యూనిఫాం కుట్టుకూలిని కూడా రూ.10 ప్రభుత్వం పెంచింది. దీంతో 45 రూపాయలు ఇవ్వనున్నారు. విద్యా కానుక కోసం ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,100 కోట్లు కేటాయించింది.

ఏపీలో జూన్ 12 నుంచే బడులు తెరుచుకోనున్నాయి. వడగాల్పులు, తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో జూన్ 17 వరకు ఒంటి పూట బడులు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 17 వరకు ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 11 గంటల 30 నిమిషాల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 19 నుంచి యథాతథంగా రెండుపూటల స్కూల్స్ కొనసాగుతాయి.

Updated : 11 Jun 2023 6:10 PM IST
Tags:    
Next Story
Share it
Top