Home > ఆంధ్రప్రదేశ్ > AP Congress Manifesto : ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలకు ముహుర్తం ఖరారు..ఏ రోజంటే?

AP Congress Manifesto : ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలకు ముహుర్తం ఖరారు..ఏ రోజంటే?

AP Congress Manifesto  : ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలకు ముహుర్తం ఖరారు..ఏ రోజంటే?
X

ఎన్నికలు సమీపిస్తుడడంతో రోజురోజుకి ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఏపీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడి రాజకీయాలు సరికొత్త టర్న్ తీసుకున్నాయి. జిల్లా జిల్లాకు పర్యటిస్తూ షర్మిల పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అంతేగాక పార్టీ మీటింగ్ లో సీఎం జగన్, ప్రతిపక్షాలపై విమర్శలు, నిప్పులు చెరిగే స్పీచ్ లతో జనాలను ఆకర్షిస్తున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. కర్నాటక, తెలంగాణ మాదిరి ఏపీలోనూ తన జోరు కొనసాగించేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది.

కాంగ్రెస్ మానిఫెస్టో విడుదలకు ముహుర్తం ఖరారు చేసింది ఏపీ కాంగ్రెస్. ఈ నెల 25న కాంగ్రెస్ మానిఫెస్టో చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు తిరుపతిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు సభ అనుమతి కోసం ఎస్వీయూ వీసికి ఏపీ కాంగ్రెస్ వినతి పత్రం అందించారు. తిరుపతిలో జరిగే భారీ బహిరంగ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్నాటక సీఎం సిద్ధరామయ్య హాజరుకానున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పోటాపోటీగా పర్యటిస్తున్నారు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. మ్యానిఫెస్టోను విడుదల చేసిన అనంతరం పార్టీ కార్యకర్తలు జోరుగా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునివ్వనున్నారు.

ఏపీలోనూ 6 గ్యారెంటీలు?

ఇప్పటికే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అనే మ్యానిఫెస్టోతో కర్నాటక, తెలంగాణలో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్..ఏపీలోనూ ఇదే తరహాత ప్లాన్ తో రానున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో విడుదల చేసే మ్యానిఫెస్టోలోనూ 6 గ్యారెంటీలనూ హైలెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మహిళలకు ఫ్రీ బస్సు, గృహ లక్ష్మీ, 500కే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలతో ప్రజలను ఆకర్షించేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ, కర్నాటకలో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ ఏపీలోనూ అదే తరహా జోరును కొనసాగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.




Updated : 16 Feb 2024 2:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top