ఆర్జీవీ బట్టలూడదీసి కొడతాం..కాంగ్రెస్ వార్నింగ్ !
X
వివాదాస్పద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఆర్జీవీ. సమస్యాత్మక అంశాలను తెరకెక్కించి కాంట్రవర్సీలు కొనితెంచుకోవడం ఆయనకు అలవాటే. తాజాగా ఏపీ రాజకీయాల నేపథ్యంలో తీస్తున్న ‘వ్యూహం’ సినిమా టీజర్ వదిలి సంచలనం సృష్టించాడు. టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్‌గా, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దుతగా వ్యూహం సినిమా తీస్తున్నట్లు టీజర్ ద్వారానే ఆర్జీవీ చెప్పేశాడు. దీంతో ఆర్జీవీపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నాయకులు కూడా ఆర్జీవీని టార్గెట్ చేశారు. సినిమాలో సోనియా గాంధీని తప్పుగా చూపెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆర్జీవీకి వార్నింగ్ ఇచ్చాడు. సంచలనాల కోసం ఈ సినిమాలో కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీని కించపరిచేలా చూపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. తమ అధినేత్రిని తప్పుగాచూపెడితే బట్టలూడదీసి కొడతామని హెచ్చరించారు. గాంధీ, నెహ్రూల కుటుంబాన్ని విమర్శిస్తే ఆర్జీవీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కాంగ్రెస్ అధిష్టానం మాట వినని కారణంగానే.. సీబీఐ కేసులు, అరెస్ట్‌లు అంటూ వ్యూహం టీజర్‌లో ఆర్జీవీ చూపించాడు. దీంతో కాంగ్రెస్ నేతలు ఫైర్ అవతున్నారు.
2019 ఎన్నికలకు ముందు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో ముందుకొచ్చిన ఆర్జీవీ..ప్రస్తుతం ‘వ్యూహం’ తో వస్తున్నాడు. ఏపీ రాజకీయాలే లక్ష్యంగా రెండు భాగాలుగా ‘వ్యూహం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందులో వ్యూహం తొలిపార్టు కాగా, రెండోది శపథం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తొలిపార్టులో YSR మరణం తర్వాత రాజకీయ పరిణామాలు చూపించనున్నాడు. శపథంలో జగన్ ఎలా సీఎం అయ్యాడు అనేది ఆర్జీవి చూపించనున్నట్లు తెలుస్తోంది. ఒక్క టీజర్‌తోనే వివాదాలు కొనితెచ్చుకున్న వ్యూహం సినిమాపై ఇంకా ఎన్ని గొడవలు జరుగుతాయో చూడాలి.