Home > ఆంధ్రప్రదేశ్ > డాక్టర్. సాకే భారతికి ఏపీ ప్రభుత్వ సాయం

డాక్టర్. సాకే భారతికి ఏపీ ప్రభుత్వ సాయం

డాక్టర్. సాకే భారతికి ఏపీ ప్రభుత్వ సాయం
X

కూలీ పనులు చేస్తూ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తి చేసిన డాక్టర్‌ సాకే భారతి కి ఏపీ ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఆమెకు 2 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ గౌతమి ఆమెకు భూమి పట్టా అందజేశారు. దీంతో పాటు భారతికి జూనియర్ కాలేజీ లెక్చరర్ ఉద్యోగం ఆఫర్ చేశారు.

కూలీ పని చేస్తూ ఎస్కే యూనివర్సిటీలో కెమిస్ట్రీలో సాకే భారతి పీహెచ్‌డీ పూర్తి చేయడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ గౌతమి అన్నారు. సంకల్పం ఉంటే విజయాన్ని ఏది ఆపలేదనడానికి భారతి నిదర్శనమని చెప్పారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఆమె యువతకు రోల్ మోడల్‌గా నిలిచారని ప్రశంసించారు. అసంపూర్తిగా ఉన్న ఆమె ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

ఏపీలోని అనంతపురం జిల్లా శింగనమల నాగుల గుడ్డం గూడేనినికి చెందిన భారతి.. ఓవైపు కూలీ పనులు చేసుకుంటూనే భర్త ప్రోత్సాహంతో ఇంటర్, డిగ్రీ, పీజీ చేసింది. పదో తరగతి దాకా శింగనమల ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్‌ పామిడి జూనియర్‌ కాలేజీలో చదివింది. శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీ నుంచి కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తి చేసింది.




Updated : 31 July 2023 10:48 PM IST
Tags:    
Next Story
Share it
Top