Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కోర్టుకు ఏపీ ప్రభుత్వం

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కోర్టుకు ఏపీ ప్రభుత్వం

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కోర్టుకు ఏపీ ప్రభుత్వం
X

ఏపీలోని రాజకీయాలు వేడెక్కాయి. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వలంటీలర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ చేయడం కాకరేపుతోంది. ఈనెల 9వ తేదీన ఏలూరు వేదికగా వలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ ఇంకా కొనసాగుతునే ఉంది. ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక వలంటీర్లపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఏపీ సర్కార్ తీవ్రంగా పరిగణించింది.

పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్పెషల్‌ సీఎస్‌అజయ్‌ జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై 1973 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ప్రకారం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. వలంటీర్లపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు సంబంధింత కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేయాలని పీపీకి ఆదేశాలు జారీ అయ్యాయి.

వారాహి రెండో విడత యాత్రలో భాగంగా వలంటీర్లపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పర్సనల్ డేటాను వలంటీర్లు సేకరించి చి సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని ఆరోపించారు. అమ్మాయిలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా లేదా? వితంతువులున్నారా లేదా అనే వివరాల్ని సేకరిస్తున్నారని మండిపడ్డారు. అంతేక కాకుండా వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ చేసిన ఆ వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Updated : 20 July 2023 6:37 PM IST
Tags:    
Next Story
Share it
Top