Home > ఆంధ్రప్రదేశ్ > AP JAC Employees : రేపు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

AP JAC Employees : రేపు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

AP JAC Employees  : రేపు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు
X

ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో నేడు 104 ఉద్యోగ సంఘాలు సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆ సంఘాలు ఉద్యమ శంఖారావం పోస్టర్‌ను విడుదల చేశాయి. తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, అందుకోసమే తాము ఉద్యమ కార్యాచరణకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలకు ఆహ్వానం పలికింది.

రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు సచివాలయంలో ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగ సంఘాలకు మధ్య సమావేశం జరగనుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చించి మంత్రుల బృందం రేపు నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వం తమకు రూ.6,700 కోట్ల బకాయిలు ఇవ్వాలని, గత నాలుగేళ్లలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నాలుగు డీఏలు, పదవీ విరమణ బకాయిలు కూడా చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు అధ్యక్షతన రేపు సమావేశం నిర్వహించనున్నారు. అయితే మరోసారి ప్రభుత్వం చర్చల్లో విఫలం అయితే నిరసన చేస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఉద్యోగ వ్యతిరేక విధానంపై నిరసన తెలుపడం ఖాయమన్నారు. ఈనెల 20వ తేదిన కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 27న ఛలో విజయవాడ కార్యక్రమాన్నిచేపడుతామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఏ క్షణమైనా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.





Updated : 11 Feb 2024 8:51 PM IST
Tags:    
Next Story
Share it
Top