Home > ఆంధ్రప్రదేశ్ > AP Govt: దసరా సెలవుల్లో మార్పులు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

AP Govt: దసరా సెలవుల్లో మార్పులు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

AP Govt: దసరా సెలవుల్లో మార్పులు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం
X

ఏపీలోని జగన్ సర్కార్ దసరా పండుగ సెలవును మార్చింది. పండుగ సెలవును ఈ నెల 23 కు బదులుగా 24కు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్ లోనూ మార్పులు చేసినట్లు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకూ ఈ సెలవు వర్తిస్తుంది. అలాగే వ్యాపార సంస్ధలు కూడా నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం అదే రోజు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జీవో ప్రకారం 23, 24 రెండు రోజులను దసరా సెలవుగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా పాఠశాలలకు అక్టోబర్ 14 నుంచి 24వ తేదీ వరకు ఏకంగా 11 రోజుల పాటు దసరా సెలవులు ఇచ్చింది. ఈ సెలవులకు సంబంధించిన షెడ్యూల్ కూడా అధికారులు విడుదల చేశారు.

గతేడాది డిసెంబర్ 15న విడుదల చేసిన ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 24న దసరా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు. దీని ప్రకారం అక్టోబర్ 23న దసరా సెలవు ఇచ్చారు. దీన్ని ఇప్పుడు అక్టోబర్ 24కు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయిం తీసుకుంది. దీంతో అక్టోబర్ 24న ఐచ్చిక సెలవుకు బదులుగా సాధారణ సెలవు దినంగా పరిగణించాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఉత్తర్వులు పంపారు.

Updated : 18 Oct 2023 12:41 PM IST
Tags:    
Next Story
Share it
Top