Home > ఆంధ్రప్రదేశ్ > టీటీడీ పాలక మండలి సభ్యులుగా కొత్తవాళ్లు..

టీటీడీ పాలక మండలి సభ్యులుగా కొత్తవాళ్లు..

టీటీడీ పాలక మండలి సభ్యులుగా కొత్తవాళ్లు..
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. తాజాగా పాలకమండలి సభ్యులను ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి 24 మందికి టీటీడీ బోర్డులో అవకాశం కల్పిస్తూ శుక్రవారం (ఆగస్టు 25) ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ సభ్యులుగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, పొన్నాడ సతీష్ కుమార్, తిప్పేస్వామి, అశ్వత్థ నాయక్, నాగసత్యం యాదవ్ తదితర వ్యక్తులకు అవకాశం కల్పించింది.

టీటీడీ పాలక మండలి సభ్యుల వివరాలు:

* పొన్నాడ వెంకట సతీశ్‌ కుమార్‌ (ఎమ్మెల్యే)

* ఉదయభాను సామినేని (ఎమ్మెల్యే)

* ఎం.తిప్పేస్వామి (ఎమ్మెల్యే)

* సిద్దవటం యండయ్య

* చిందె అశ్వర్థనాయక్‌

* మేకా శేషుబాబు

* ఆర్‌. వెంకటసుబ్బారెడ్డి

* ఎల్లారెడ్డిగారి సీతారామరెడ్డి

* గడిరాజు వెంకట సుబ్బరాజు

* పెనక శరత్‌చంద్రారెడ్డి

* రామ్‌రెడ్డి సాముల

* బాలసుబ్రమణియన్‌ పళనిస్వామి (తమిళనాడు)

* ఎస్‌.ఆర్‌. విశ్వనాథ్ రెడ్డి

* గడ్డం సీతారెడ్డి

* కృష్ణమూర్తి వైద్యనాథన్‌ (తమిళనాడు)

* సిద్దా వీర వెంకట సుధీర్‌ కుమార్‌

* సుదర్శన్‌ వేణు

* నెరుసు నాగ సత్యం

* ఆర్‌.వి.దేశ్‌పాండే (కర్ణాటక)

* అమోల్‌ కాలె ( మహారాష్ట్ర, ముంబయి క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు)

* డా.ఎస్‌.శంకర్‌ ( మహారాష్ట్ర)

* మిలింద్‌ కేశవ్‌ నర్వేకర్‌ (మహారాష్ట్ర, ముంబయి క్రికెట్‌ సంఘం సభ్యుడు)

* డా కేతన్‌ దేశాయ్‌ (గుజరాత్‌)

* బోరా సౌరభ్‌


Updated : 25 Aug 2023 10:40 PM IST
Tags:    
Next Story
Share it
Top