Govt Holiday: అన్ని కార్యాలయాలకు.. రేపు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
Bharath | 27 Sept 2023 9:55 AM IST
X
X
దేశంలో చాలా చోట్ల రేపు వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ వేడుకలు జరుగనున్నాయి.(Milad un Nabi festival) చాలా ఏళ్ల తర్వాత ఈ రెండు వేడుకలు ఒకేసారి రావడం గమనార్హం. "కాగా మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేపు (సెప్టెంబర్ 28) సెలవు ప్రకటించింది". (AP Govt declared a public holiday) ఈ సెలవు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వర్తిస్తుందని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి మంగళవారం (సెప్టెంబర్ 26) దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంకు యూనియన్లతో పాటు పలు మైనార్టీ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో చెప్పుకొచ్చారు.
Updated : 27 Sept 2023 9:55 AM IST
Tags: AP Govt ap news andrapradesh Govt holiday Govt declared public holiday Milad un Nabi festival KS Jawahar Reddy AP Govt declared a public holiday AP Govt declared a public holiday on Milad un Nabi festival
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire