Home > ఆంధ్రప్రదేశ్ > 10th క్లాస్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

10th క్లాస్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

10th క్లాస్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ సంస్కృతం పేపర్లు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. మొదట్లో ఈ పేపర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించగా.. విద్యా సంవత్సరం మధ్యలో మార్పు చేయడంపై విమర్శలు వచ్చాయి. దాంతో ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అయితే వచ్చే ఏడాది నుంచి 10వ తరగతి పరీక్షల్లో కాంపోజిట్ పేపర్లు ఉండవని స్పష్టం చేసింది. కాంపోజిట్‌ తెలుగు 70, కాంపోజిట్‌ సంస్కృతం 30 మార్కులకు ఉంటాయి. కాగా ఇదే విధానాన్ని ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్‌, ఉర్దూ/ పార్శి పేపర్లకు అమలు చేయనున్నారు.

పదో తరగతి పరీక్షల్లో ఈసారి ఏడు పేపర్లు ఉండనున్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి 50 మార్కులకు, బయోలజీ 50 మార్కులకు ఉంటుంది. ఈ రెండు సబ్జెక్టులను వేరు వేరు పేపర్లుగా నిర్వహిస్తారు. రెండిట్లో కలిపి 35 మార్కులు సాధిస్తే పాస్ అవుతారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ పేపర్లు యథావిధిగా ఉంటాయి. తెలుగు, హిందీ పరీక్షల్లో ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్న కారణంగా.. క్వశ్చన్ పేపర్ లో కొన్ని మార్పులు చేశారు.




Updated : 29 Sept 2023 9:17 AM IST
Tags:    
Next Story
Share it
Top