Home > ఆంధ్రప్రదేశ్ > YS Jagan Mohan Reddy : అంగన్వాడీలను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

YS Jagan Mohan Reddy : అంగన్వాడీలను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

YS Jagan Mohan Reddy : అంగన్వాడీలను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
X

ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీల నిరసనలు రోజురోజుకు పెరిగిపోతున్న వేళ.. అక్కడి ప్రభుత్వం అంగన్వాడీలకు షాకిచ్చింది. సమ్మే విరమించి విధుల్లో చేరాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినా వినకుండా నిరసన తెలుపుతూ విధులకు హాజరుకాని అంగన్వాడీలపై చర్యలకు దిగింది. సోమవారం ఉదయం 9:30 గంటల్లోపు విధులకు హాజరుకాని వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ముందస్తుగా ఆదేశాలు జారీ చేయడంతో.. సోమవారం 15వేల మంది అంగన్వాడీలు విధులకు హాజరయ్యారు. కాగా గత కొన్ని రోజులుగా తమ జీతాలు పెంచి, సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.




Updated : 22 Jan 2024 7:49 PM IST
Tags:    
Next Story
Share it
Top