చంద్రబాబు బెయిల్పై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం..
X
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు తీర్పుపై ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆధారాలు ఉన్నాయని చెప్పిన.. హైకోర్టు తమ వాదనలను పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. సాక్ష్యాలు, ఆధారాలు ట్రయల్ కోర్టు దగ్గర ఉంటాయని.. హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందని అన్నారు.
తమకు జడ్జిని ప్రశ్నించే హక్కు లేదని.. కానీ తీర్పును ప్రశ్నించే హక్కు ఉందని పొన్నవోలు తెలిపారు. ఏపీ స్కిల్ కేసును ఈడీ, సీఐడీ దర్యాప్తు జరుపుతోందని, చార్జిషీట్ వేసినప్పుడు నిజానిజాలు బయటకు వస్తాయని అన్నారు. తమ పిటిషన్ త్వరగా విచారణకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తామని పొన్నవోలు చెప్పారు. కాగా ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. మరి ఏపీ ప్రభుత్వ పిటిషన్పై సుప్రీం ఏ తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.