Home > ఆంధ్రప్రదేశ్ > ఎస్సై ఫలితాల విడుదలకు హైకోర్టు అనుమతి

ఎస్సై ఫలితాల విడుదలకు హైకోర్టు అనుమతి

ఎస్సై ఫలితాల విడుదలకు హైకోర్టు అనుమతి
X

ఎస్సై ఫలితాలను విడుదల చోయొచ్చని రిక్రూట్మెంట్ బోర్డును ఏపీ హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సై నియామకాలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏపీ హైకోర్టు ఎత్తేసింది. కాగా ఎస్సై నియామకాల్లో అభ్యర్థుల ఎత్తు, కొలతల అంశంలో అవకతవకలు జరిగాయంటూ న్యాయవాది జడ శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఏపీ వ్యాప్తంగా 56వేల మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్టులకు హాజరయ్యారని, వారిలో సరిపడా ఎత్తులేని 5 వేల మంది అభ్యర్థులను తిరస్కరించారని శ్రవణ్ కోర్టుకు తెలిపారు. అయితే తిరస్కరణకు గురైన అభ్యర్థులందరూ 2019లో క్వాలిఫై అయినట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో ఎత్తు విషయంలో అభ్యతరం వ్యక్తమైన అభ్యర్థులకు ధర్మాసనం నియమించిన సభ్యుల ముందు తిరిగి ఫిజికల్ టెస్టులు నిర్వహించారు. ధర్మాసనం నియమించిన సభ్యులు కూడా.. అభ్యర్థుల ఫిజికల్ టెస్టులు ఇంతకుముందు తీసినవి సరితూగినట్లు తెలిపారు. దీంతో ఫలితాలు విడుదల చేసుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానితో పాటు 2019లో ఎత్తు అంశంలో క్వాలిఫై అయిన అభ్యర్థుల మెడికల్ సర్టిఫికెట్లు మళ్లీ పరిశీలించాలని రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది.

Updated : 5 Dec 2023 7:08 PM IST
Tags:    
Next Story
Share it
Top