BIG BREAKING NEWS: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్
X
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన.. విచారణ ఖైదీగా గత 52 రోజులుగా (సెప్టెంబర్ 9) రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు నాలుగు వారాలు (నవంబర్ 24) మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య పరిస్థితులు, కంటికి ఆపరేషన్ అత్యవసరం అని చంద్రబాబు తరఫు లాయర్లు వాదించగా, హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు సానుకూలంగా స్పందించారు. దీంతో దాదాపు 52 రోజుల తర్వాత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తున్నారు.
కాగా పలు మార్లు చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా.. ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్ట్ కూడా బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ బెయిల్ పై వాదనలు జరిగినా.. అది ఇంకా పూర్తి కాకపోవడంతో.. మధ్యంతరం బెయిల్ మంజూరు చేసింది హైకోర్డ్. రెగ్యులర్ బెయిల్ పై తిరిగి నవంబర్ 10న విచారణ చేపట్టనుంది. నవంబర్ 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు తిరిగి పోలీసులకు లొంగిపోవాల్సి ఉంటుంది. ఈ కేసుపై హైకోర్ట్ తిరిగి నవంబర్ 28న విచారణ చేపట్టనుంది.