Skill Development Scam: చంద్రబాబుకు ఊరట.. రెగ్యులర్ బెయిల్ మంజూరు
X
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. ప్రస్తుతం తాత్కాలిక బెయిల్పై ఉన్న చంద్రబాబు..రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ టి. మల్లిఖార్జున్ రావు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.
రెగ్యులర్ బెయిల్ రావడంతో చంద్రబాబు ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో సెప్టెంబర్ 9న ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేశారు. జ్యూడీషియల్ రిమాండ్ మీద 52 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆనారోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు చంద్రబాబుకి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది.