ఎమ్మెల్సీ అనంత బాబు కేసులో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
X
ఏపీలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంత బాబు కేసులో నేడు ఏపీ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ కేసులో తమకు న్యాయం జరగలేదని, సీబీఐకి కేసును అప్పగించాలని కోరుతూ మృతుడి తల్లితండ్రులు హైకోర్టులో పిటిషన్ ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నేడు విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయ స్థానం తీర్పు రిజర్వ్ చేసింది.
విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనంత బాబు తరఫున వాదిస్తున్న ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు ప్రశ్నలను సంధించింది. సీసీటీవీ కెమెరాల్లో కనిపించిన అనంత బాబు భార్యను సహ నిందితురాలిగా చేర్చకపోవడాన్ని హైకోర్టు ఇవాళ ప్రశ్నించింది. ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయలేదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది జాడ శ్రావణ్ వాదనలు వినిపించారు. పోలీసులు దర్యాప్తు సరిగా చేయలేదని, సహ నిందితుల్ని వదిలేశారని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా కేసు వివరాలను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు ప్రభుత్వం అందించింది.
MLC Ananta Babu, Case, AP High Court, Hearing