Home > ఆంధ్రప్రదేశ్ > అవినీతి కేసులో జగన్‌కు హైకోర్టు నోటీసులు

అవినీతి కేసులో జగన్‌కు హైకోర్టు నోటీసులు

అవినీతి కేసులో జగన్‌కు హైకోర్టు నోటీసులు
X

ఆంధప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందంటూ దాఖలైన కేసులో హైకోర్టు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ పిటిషన్ వేసి, ఆర్థిక అవకతవకలపై సీబీఐతో పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశించారు. గురువారం దీన్ని పరిశీలించిన కోర్టు సీంతోపాటు 40 మందికి నోటీజులు జారీ చేసింది. వీరిలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నత స్థాయి ప్రభుత్వాధికారులు ఉన్నారు. తను పిటిషన్ వేయగానే ప్రభుత్వం పలు రికార్డులను హడావుడిగా నాశనం చేసిందని రఘురామకృష్ణ రాజు కోర్టుకు విన్నవించారు. అయితే ఆయన కేవలం దురుద్దేశంతో పిటిషన్ వేశారని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ఆరోపించారు. వ్యక్తిగత కారణాలతో వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని, దాన్ని కొట్టేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు దీనిపై ప్రభుత్వ స్పందన కోరతామంటూ నోటీసులు జారీ చేస్తూ విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.


Updated : 23 Nov 2023 5:39 PM IST
Tags:    
Next Story
Share it
Top