Home > ఆంధ్రప్రదేశ్ > హైకోర్టు ఆదేశం.. ఎస్సై అభ్యర్థులకు మళ్లీ ఫిజికల్ టెస్ట్లు

హైకోర్టు ఆదేశం.. ఎస్సై అభ్యర్థులకు మళ్లీ ఫిజికల్ టెస్ట్లు

హైకోర్టు ఆదేశం.. ఎస్సై అభ్యర్థులకు మళ్లీ ఫిజికల్ టెస్ట్లు
X

ఎస్సై పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ శని, ఆదివారం నిర్వహించే ఎస్ఐ పరీక్షలపై ఏపీ హైకోర్ట్ తీర్పునిచ్చింది. ఎత్తు విషయంలో తమకు అనర్హత ఉన్నా.. అన్యాయంగా తమను అనర్హతకు గురిచేశారని కొందరు ఎస్ఐ అభ్యర్థులు ఏపీ హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. ఎత్తు కొలిచే విషయంలో పరికరాల తప్పిదం వల్ల వేలాది మంది అభ్యర్థులు అర్హత కోల్పోయారని పిటిషనర్ల తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు.

దీనిపై హైకోర్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 2019లో అర్హత సాధించిన అభ్యర్థులు 2023లో ఎలా అనర్హులు అవుతారని కోర్ట్ ప్రశ్నించింది. ఈ క్రమంలో అనర్హతైన అభ్యర్థులందరికీ మరోసారి ఫిజికల్ టెస్ట్ కు అనుమతించి, ఎలక్ట్రానిక్ మెషిన్ తో కాకుండా మాన్యువల్ గా టెస్ట్ లు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. అర్హత ఉన్న ప్రతీ అభ్యర్థిని అనుమతించాలని స్పష్టం చేసింది. అర్హత ఉన్న ప్రతీ అభ్యర్థికి సమాచారం ఇచ్చి.. 3 రోజుల్లోపు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది.


Updated : 13 Oct 2023 7:04 PM IST
Tags:    
Next Story
Share it
Top