Chandrababu Naidu : సీఐడీ మరో పిటిషన్.. చంద్రబాబు బెయిల్కు మరిన్ని ఆంక్షలు..
X
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తాత్కాలిక బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఏపీ సీఐడీ అధికారులు హైకోర్టులో మెమో దాఖలు చేశారు. తాత్కాలిక బెయిల్ లో మరో 5 నిబంధనలు చేర్చాలని పిటిషన్ వేశారు. చంద్రబాబు రాజకీయ యాత్రలు, ప్రసంగాలు, సభల్లో పాల్గొనకూడదని, మీడియాకు ఇంటర్వూలు ఇవ్వొద్దని, కేవలం వైద్యం కోసమే బెయిల్ను ఉపయోగించాలని, కేసు వివరాలను పబ్లిక్ గా మాట్లాడొద్దని, ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు ఆయన కదలికల వివరాలను కోర్టుకు సమర్పించేలా షరతువు విధించాలని ధర్మాసనాన్ని విన్నవించారు.
సీఐడీ అధికారుల పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం రేపటి వరకు చంద్రబాబు ర్యాలీల్లో పాల్గొనవద్దని ఆదేశించింది. ఆయన మీడియాతో మాట్లాడొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు న్యాయవాదులను ఆదేశించిన న్యాయమూర్తి కేసు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.