Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu : చంద్రబాబుకు షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పిటిషన్ను విచారించేందుకు..

Chandrababu : చంద్రబాబుకు షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పిటిషన్ను విచారించేందుకు..

Chandrababu : చంద్రబాబుకు షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పిటిషన్ను విచారించేందుకు..
X

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. బెయిల్పై ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది. స్కిల్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఆయన లంచ్ మోషన్ దాఖలు చేశారు. ఈ కేసులో చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడా నిరాశే ఎదురైంది.

మరోవైపు సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హోరాహోరీ వాదనలు సాగుతున్నాయి. చంద్రబాబు తరుపున హరీష్ సాల్వే, సీఐడీ తరుపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. 17A చట్టం చంద్రబాబుకు వర్తిస్తుందని సాల్వే, వర్తించదని రోహత్గీ వాదిస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


Updated : 10 Oct 2023 12:53 PM IST
Tags:    
Next Story
Share it
Top