ఏపీలో ఎస్సై నియామక ప్రక్రియకు బ్రేక్
Kiran | 17 Nov 2023 2:25 PM IST
X
X
ఏపీలో ఎస్సై నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. ఎస్సై నోటిఫికేషన్ పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా ఎత్తు విషయంలో అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. గతంలో అర్హులైనవారిని ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని పిటిషన్ వేశారు.
బాధిత అభ్యర్థుల పిటిషన్పై అడ్వొకేట్ జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులెలా అవుతారని హైకోర్టు ధర్మాసనం పోలీసు నియోమక బోర్డును ప్రశ్నించారు. నియామక ప్రక్రియను నిలిపివేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా.. వారి వాదనలతో ఏకీభవించి ఉన్నత న్యాయస్థానం ఎస్సై నోటిఫికేషన్‌పై స్టే విధించింది.
Updated : 17 Nov 2023 2:25 PM IST
Tags: andhra pradesh ap high court si recruitment si candidates disqualified advocate jada shravan high court stay stay on si recuritment candidates height height issue
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire