Home > ఆంధ్రప్రదేశ్ > Ambati Rambabu : నోరు అదుపులో పెట్టుకో.. లేదంటే..: చంద్రబాబుకు అంబటి మాస్ వార్నింగ్

Ambati Rambabu : నోరు అదుపులో పెట్టుకో.. లేదంటే..: చంద్రబాబుకు అంబటి మాస్ వార్నింగ్

Ambati Rambabu : నోరు అదుపులో పెట్టుకో.. లేదంటే..: చంద్రబాబుకు అంబటి మాస్ వార్నింగ్
X

దివంగత టీడీపీ నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌ మరణానికి.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే (Chandra Babu) కారణమని ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో కోడెల ఓటమి పాలైతే కనీసం ఆయనను పలకరించకపోగా వారి కుటుంబాన్ని రాజకీయంగా పక్కకు పెట్టడడంతో కోడెల మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.

కోడెల లాంటి రాజకీయ నాయకుడు రాజకీయంగా శత్రువులకు బయపడే వారు కాదని అన్నారు. కోడెల ఆత్మహత్యకు వైఎస్‌ జగన్‌ కారణమని చేస్తున్న ఆరోపణలను మంత్రి తిప్పిగొట్టారు. కోడెల పేరుతో ఎన్నికల్లో లబ్దిపొందడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కోడెలపై ప్రేమ ఉంటే వారి కుటుంబంలో ఒకరికి టికెట్‌ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

తన గురించి మాట్లాడేటప్పుడు చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అంబటి రాంబాబు హెచ్చరించారు. తనను ఆంబోతు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘నన్ను ఆంబోతు అంటున్నావ్‌.. నీ చరిత్ర ఏంటో తెలుసుకో చంద్రబాబు. ఆంబోతులకు ఆవులను సప్లయి చేసిన చరిత్ర నీది. చంద్రబాబు మాట్లాడేటప్పుడు నాలుక జాగ్రత్త. చంద్రబాబు ఒక చీటర్‌. చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నాడు. చంద్రబాబు చెత్త పాలన చేశారు కాబట్టే చిత్తుచిత్తుగా ఓడిపోయారు. చంద్రబాబు ఓ మోసగాడు, ఓ 420. ​కోడెల ఆత్మహత్యకు కారణం చంద్రబాబు. కోడెల కుటుంబాన్ని చంద్రబాబు వేధించారు. చంద్రబాబు కుట్రలకు కోడెల భయపడ్డారు. కోడెల చనిపోయినా ఆ కుటుంబంపై చంద్రబాబుకు కక్ష పోలేదుకోడెల కుటుంబానికి టికెట్‌ ఎందుకు ఇవ్వలేదు’ అని ప్రశ్నించారు.

ఈసారి ఎన్నికల్లో టీడీపీ నావ పూర్తిగా మునిగిపోతుందని జోస్యం చెప్పారు. మునిగిపోయే నావను కాపాడుకునేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు. పల్నాడులో ఏడుగురు టీడీపీ అభ్యర్థులను ఓడించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. తన ఎమ్మెల్యేలను ఓడించే దమ్ము చంద్రబాబుకు లేదని మంత్రి అంబటి తేల్చి చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలను ఓడించే దమ్ము బాబుకు లేదని వెల్లడించారు.




Updated : 3 March 2024 1:48 PM GMT
Tags:    
Next Story
Share it
Top