Ambati Rambabu : వైఎస్ షర్మిలపై మంత్రి అంబటి సీరియస్
X
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఆదివారం మంత్రి రాంబాబు మాట్లాడుతూ..వైఎస్ కూతురు, సీఎం జగన్ సోదరి కావడంతో తాము వైఎస్ షర్మిలను విమర్శించలేకపోతున్నామని అన్నారు. షర్మిల ఇష్టారాజ్యంగా మాట్లాడుతోందని, కొంచెం ఓవర్ యాక్షన్ కూడా చేస్తోందని అంబటి రాంబాబు విమర్శించారు.
సీఎం జగన్‌ను దూషించిన వైఎస్ షర్మిల తనపై ఉన్న సానుభూతిని పోగొట్టుకున్నారని అంబటి రాంబాబు అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అసలు పోటీలోనే లేదని, ఎన్నికల పోటీల్లో కేవలం వైసీపీ, టీడీపీ మాత్రమే ఉన్నాయన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ కలుస్తారని గతంలోనే తాము చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా తమకేమీ ఇబ్బంది లేదన్నారు.
ఏపీలో 50 శాతానికి పైగా ఓటర్లు సీఎం జగన్ వెంటే ఉన్నారని ఆయన దీమా వ్యక్తం చేశారు. సర్వేలను ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తమ పార్టీ బలంగా ఉందని, వైఎస్ జగన్ ప్రచారం మొదలుపెడితే ప్రజల మద్దతు మరింత పెరుగుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్‌ను టచ్ కూడా చేయలేరన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హాటీలను 99 శాతం వరకూ అమలు చేసి వైసీపీ ముందుకు సాగుతోందన్నారు.