Home > ఆంధ్రప్రదేశ్ > రేణూ దేశాయ్‌కి అంబటి రాంబాబు రిక్వెస్ట్.. అమ్మా..

రేణూ దేశాయ్‌కి అంబటి రాంబాబు రిక్వెస్ట్.. అమ్మా..

రేణూ దేశాయ్‌కి అంబటి రాంబాబు రిక్వెస్ట్.. అమ్మా..
X

పవన్ కల్యాణ్ తాజా మూవీ ‘బ్రో’ ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. మూవీలో తన కేరెక్టర్ పెట్టి గేలి చేశారని మండిపడుతున్న మంత్రి అంబట రాంబాబు రోజూ ఏదో ఒక మిమర్శ చేస్తూనే ఉన్నారు. సినిమా ప్లాప్ అని, టీడీపీ కుట్ర ఉందని హల్‌చల్ చేస్తున్నారు. ఆయన విమర్శలతో కలెక్షన్లు పెరిగాయని మూవీ టీమ్ అంటోంది. గొడవ మధ్యలో పవన్ పెళ్లిళ్ల ప్రస్తావనా వస్తోంది. దీంతో ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ రంగంలోకి దిగారు. మీరూ మీరూ ఎలాగన్నా కొట్టుకుని చావండిగాని మధ్యలోకి తనను, తన పిల్లలను లాగొద్దని వీడియో చేశారు. దీనిపై అంబటి స్పందించారు. ‘‘అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని!’ అని కోరారు. సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందిన వవన్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన ‘బ్రో’ చిత్రంలో అంబటి పోలిన పాత్రను పృథ్వీరాజ్‌తో చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమ ఉద్దేశపూర్వకంగా అలా చేయలేని టీమ్ చెప్పుకుంటున్నా పృథ్వీ బట్టలు, డ్యాన్స్ అంబటినే పోలి ఉన్నాయి.

రేణూ ఏమన్నారంటే..

‘‘పవన్ సమాజసేవ కోసం ముందుకొచ్చారు. ఆయన డబ్బు మనిషి కాదు. పేదవాళ్ల కోసం నిరంతరం ఆలోచిస్తారు. ఆయనకు పొలిటికల్‎గా ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటాను. నాకు చేతనైనంత నేను చేస్తున్నాను. ఆయన కుటుంబాన్ని, సొంత పిల్లల్ని కాదనుకుని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయంగా ఆయన సేవను గుర్తించి అండగా నిలబడండి.. తాజా వివాదం గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. కాకపోతే, పవన్‌పై సినిమా, వెబ్‌ సిరీస్‌ చేస్తామని ఇటీవల కొంతమంది అన్నారు. ఆయన పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల గురించి ఈ సినిమా ఉంటుందన్నారు. అందుకే ఒక తల్లిగా ఓ అభ్యర్థన చేస్తున్నా.. దయచేసి పిల్లలను అందులోకి లాగకండి. నా పిల్లలనే కాదు, ఎవరి పిల్లలనూ, ఆడవాళ్లనూ రాజకీయాల్లోకి లాగొద్దు. రాజకీయంగా ఏదైనా ఉంటే మీరూ మీరూ చూసుకోండి..’’ అని రేణూ కోరారు.

Updated : 10 Aug 2023 10:57 PM IST
Tags:    
Next Story
Share it
Top