Home > ఆంధ్రప్రదేశ్ > స్కిల్ స్కాంలో ఎవరినీ వదిలిపెట్టం : మంత్రి బొత్స

స్కిల్ స్కాంలో ఎవరినీ వదిలిపెట్టం : మంత్రి బొత్స

స్కిల్ స్కాంలో ఎవరినీ వదిలిపెట్టం : మంత్రి బొత్స
X

స్కిల్ స్కామ్‎లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సెటైరికల్ పంచులు పేల్చారు. మీడియా ముఖంగా దొంగ దొరికిపోయి జైలుకు వెళ్లారని చురకలంటించారు. ఈ స్కామ్‎కు సంబంధించి పక్కా ప్రూఫ్స్ తమదగ్గర ఉన్నాయని అన్నారు. ఈ కేసులో ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికైనా బాబుకు మద్దతు పలికేవారంతా ఆయన్ని ప్రశ్నించాలన్నారు.

మీడియాతో మంత్రి బొత్స మాట్లాడుతూ.." స్కిల్‌ కేసులో ఎవరిమీద మాకు ప్రేమ లేదు. ఈ కేసులో ఎవరి పాత్ర ఉన్నా వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. రిమాండ్‌ కొనసాగింపు సమయంలో తప్పు చేయలేదని చంద్రబాబు అంటున్నారు. అందుకే పబ్లిక్ లైఫ్‎లో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. అవినీతిరహిత పాలన సాగించాలి. ఇన్నాళ్లూ బాబు, దొరికితే దొంగ.. దొరకకపోతే దొర అన్నట్టుగా వ్యవహరించారు. రాష్ట్ర సర్కార్ తన షేర్ ఇచ్చిన తర్వాత కూడా సీమెన్స్ సంస్థ తన వాటాను ఇవ్వలేదు ఎందుకు? ఈ మధ్యలోనే డిజైన్ టెక్ ఎలా వచ్చింది?. చంద్రబాబు తెలిసి తెలిసే తప్పు చేశారు. సీమెన్స్

సంస్థ మంచి కంపెనీనే కానీ, అగ్రిమెంట్ ప్రకారం జరగలేదు. సాఫ్ట్‎వేర్‎కు రూ.2900 కోట్లా?. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారు. ఈ కేసులో అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. జగన్ ప్రభుత్వం అవినీతిని అస్సలు సహించదు. ఇష్టం వచ్చినట్లు చేస్తూ కూర్చుంటే సర్కార్ చూస్తూ ఉండదు. అవినీతికి పాల్పడినవారు ఎంతవారైనా చర్యలు తీసుకుంటాం. ఈ అవినీతిపై చంద్రబాబు మద్దతుదారులు ఆయన్ని ఎందుకు ప్రశ్నించరు.




Updated : 23 Sept 2023 2:35 PM IST
Tags:    
Next Story
Share it
Top