Home > ఆంధ్రప్రదేశ్ > హైకోర్టు లాయర్గా ఏపీ మంత్రి సతీమణి..

హైకోర్టు లాయర్గా ఏపీ మంత్రి సతీమణి..

హైకోర్టు లాయర్గా ఏపీ మంత్రి సతీమణి..
X

ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ సతీమణి లాయర్ అయ్యారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేసిన బొత్స ఝాన్సీ లక్ష్మీ ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యత్వం తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు మంత్రి అభినందనలు తెలిపారు. కాగా గతంలో ఝాన్సీ రెండు సార్లు ఎంపీ, రెండుసార్లు జడ్పీ చైర్మన్గా పనిచేశారు.

రాజకీయాల్లో ఉంటూనే ఆమె లా పూర్తి చేశారు. బొబ్బలి, విజయనగరం ఎంపీగా ఆమె పనిచేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందారు. ఎంపీగా ఉన్న సమయంలోనే మహిళా సాధికారత, సామాజిక న్యాయశాస్త్రంపై పీహెచ్ డీ పూర్తిచేశారు. విజయనగరం జడ్పీ చైర్మన్గా కూడా రెండు సార్లు పనిచేశారు. ప్రస్తుతం ఆమె వయస్సు 59ఏళ్లు కాగా.. చదవుకు వయస్సు అడ్డుకాదని నిరూపించింది.

Updated : 14 Aug 2023 1:18 PM IST
Tags:    
Next Story
Share it
Top