Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలకు మంత్రి అమర్ నాథ్ కౌంటర్

పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలకు మంత్రి అమర్ నాథ్ కౌంటర్

పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలకు మంత్రి అమర్ నాథ్ కౌంటర్
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)పై మంత్రి గుడివాడ అమర్ నాథ్ (Mimister Gudivada Amar Nath) సంచలన వ్యాఖ్యలు చేశారు. రుషికొండ వద్ద ఎదో హడావుడి చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘నువ్వు మీ డాడీ చంద్రబాబు (Chandrababu) కన్నా దండుపాళ్యం బ్యాచ్ ఏం ఉంటుంది.. ప్యాకేజీకి అమ్ముడు పోయావ్.. 2 లక్షల పుస్తకాలలో జ్ఞానం వచ్చే పుస్తకాలు చదివి ఉంటే మంచిది. రుషికొండ వద్ద పవన్ కళ్యాణ్ అన్నయ్య చెప్పినట్టు ఫేస్ లెఫ్ట్ టర్న్ చేసి ఉంటే గీతం కాలేజీ కనిపించేది.. చంద్ర బాబు బంధువు కాబట్టే గీతం కాలేజీ అక్రమ నిర్మాణం, కబ్జా పవన్ కళ్యాణ్‌కు కనిపించలేదా? జగదాంబ జంక్షన్‌లో వాలంటీర్‌లు అన్నదమ్ములు అన్నారు.. మళ్లీ నిన్న దండుపాళ్యం బ్యాచ్ అంటున్నారు.. అందులో దండుపాళ్యం నువ్వేనా పవన్..’’ అంటూ మంత్రి అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రిషికొండలో నిబంధనలకు విరుద్దంగా డ్రోన్ లు ఎగురవేసినందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై కేసులు పెడతామని చెప్పారు. రెండు రోజుల క్రితం రిషికొండ పరిశీలనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని మంత్రి ఆరోపించారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ కూడ జనసేన నేతలు పట్టించుకోలేదన్నారు. నిబంధనలకు విరుద్దంగా రిషికొండలో డ్రోన్ కెమెరాలను ఉపయోగించారని మంత్రి మండిపడ్డారు. అనుమతి లేకుండా ప్రభుత్వం చేసే నిర్మాణాల వద్దకు పవన్ కళ్యాణ్ వెళ్లాడన్నారు. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలు నిర్మాణాలు చేస్తుంటే అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై పోలీస్ కేసు నమోదు చేస్తామన్నారు.

విస్సన్నపేట భూముల వద్దకు పవన్ కళ్యాణ్ వెళ్లడానికి అభ్యంతరం లేదన్నారు. అయితే విస్సన్నపేటలో తనకు ఒక్క సెంటు భూమి ఉన్నట్టు నిరూపిస్తే ఆ భూమిని వారికే రాసిస్తానన్నారు. విసన్నపేటలో 600 ఎకరాలు కబ్జా చేశామన్న అరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విసన్నపేటలో తన పేరుమీద గానీ, తన కుటుంబసభ్యుల పేరుపైగానీ భూమి ఉందని నిరూపిస్తే.. జర్నలిస్టులకు , జనసేన నేతలకు రాసిస్తానన్నారు. హైద్రాబాద్ జూబ్లీహిల్స్ చిరంజీవి, చంద్రబాబు ఎక్కడ ఇళ్లు నిర్మించారని మంత్రి అమర్ నాథ్ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. ఏపీ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఏనాడైనా పవన్ కళ్యాణ్ ప్రకటించాడా అని ఆయన ప్రశ్నించారు.

Updated : 13 Aug 2023 12:31 PM IST
Tags:    
Next Story
Share it
Top