పవన్.. నువ్వు జగన్ వెంట్రుకను కూడా పీకలేవ్ : రోజా
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్.. జగన్ వెంట్రుకను కూడా పీకలేడని విమర్శించారు. ‘‘పవన్కు ఇప్పటికే 55ఏళ్లు వచ్చాయి. ఇంకో 45ఏళ్ల టైం ఇస్తున్న. జగన్ చిటికెన వేలుపైన ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రిలీజైన బ్రో సినిమాను నాలుగు ఆటలు కూడా ఆడించుకోలేని పవన్.. జగన్ను ఏం ఆడిస్తారని ఫైర్ అయ్యారు.
సోనియా గాంధీనే ఎదురించిన జగన్ను ఆడించాలంటే పవన్కు ఉన్న జీవితం కూడా సరిపోదని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరవమంటేనే పవన్ అరుస్తాడని.. ఆయనకు జెండా, అజెండా అంటూ ఏమిలేవని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసమే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. పక్కవాళ్లను సీఎం చేయడానికే పవన్ పార్టీ పెట్టారని.. ఆయన పనికిమాలిన కల్యాణ్ అని ఆరోపించారు. ఉత్త పుత్రుడు, దత్త పుత్రుడిని చెరో వైపు పెట్టుకొని ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని మండిపడ్డారు.
చిరంజీవికి సడెన్గా ఏమైంది..
ఇన్నాళ్లూ చిరంజీవి పెద్దమనిషిగా, బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నారు కానీ సడెన్గా జగన్ మీద విషం చిమ్మడం మొదలుపెట్టారు అని రోజా విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లు ఏపీలో ఇల్లు కట్టుకొని ప్రజలకు ఎప్పుడైనా భరోసా కల్పించారా అని రోజా ప్రశ్నించారు. కానీ జగన్ ఇడుపులపాయలోనే ఇల్లు కట్టుకుని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు. ఏపీ సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొట్టేలా జగన్ పాలన సాగుతుందన్నారు.