టీడీపీ సంచలనం.. వివేకా హత్యపై మంట పెట్టేసిందిగా...
X
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రపంచ పోలీసులకు ఒక స్టడీ కేసుగా మిగిపోతుందని అంటున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశచరిత్రలోనే తొలిసారిగా ఒక హత్య కేసుపై ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు చేశారు. ‘vivekanandareddykinyayam.in’ పేరుతో టీడీపీ ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. వివేకా హత్యకు సంబంధించిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. దీన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తారని సమాచారం. తెలుగుతోపాటు ఇంగ్లిష్‌లోనూ ఈ సైట్ అందుబాటులో ఉంది.
వివేకా కుటుంబానికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించామని టీడీపీ వర్గాలు చెప్పాయి. వైసీపీ నేతలు కేసును పక్కదారి పట్టిస్తున్నారని, తప్పుడు సమాచారం, వక్రభాష్యాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తుండడంతో వాస్తవాలు అందరికీ అందుబాటులో ఉండేందుకు వెబ్‌సైట్ ఏర్పాటు చేశామని తెలిపాయి. ఈ సైట్లో వివేకా పుట్టుపూర్వోత్తాలతోపాటు హత్యకు కారనాలు, కాలక్రమం, వైసీపీ అధినేత జగన్, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రులు, కీలక నిందితుడైన కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తదితరులు చేసిన, మార్చిన సమాచారాన్ని, వీడియోలను ఏపీ ప్రభుత్వ విచారణ, సీబీఐ విచారణ, ఛార్జిషీట్లను వివిధ విభాగాల కింద పొందుపరిచారు. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ సైట్ ఓపెన్ కావడం లేదు. కొందరికి ఓపెన్ అవుతోందని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం దీనిపై వేటు వేసే అవకాశం ముందని వార్తలు వస్తున్నయి. వివేకా టీడీపీనే హత్య చేయించిందని మొదట్లో చెప్పిన వైకాపా నేతలు తర్వాత మాటమార్చి ఆయన కుటుంబమే చంపించిందని చెబుతున్న సంగతి తెలిసిందే.