పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. హల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండిలా
Mic Tv Desk | 14 Aug 2023 5:34 PM IST
X
X
ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ, ఆర్ఎస్ఐ పోస్టులకు సంబంధించిన ఫిజికల్ ఈవెంట్స్ హాల్ టికెట్లను ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (APSLPRB) విడుదల చేసింది. ప్రలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని APSLPRB ప్రకటించింది. ఈ నెల 25వ తేదీ నుంచి ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షలు జరగనున్నాయి. కాగా ఈ ఈవెంట్స్ ను విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 24 మధ్యాహ్నం 3 గంటల వరకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి. ఈవెంట్స్ కు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమతో స్టేజ్ 2 అప్లికేషన్ ఫామ్ తీసుకురావాలని APSLPRB సూచించింది. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేవాళ్లు.. https://slprb.ap.gov.in/ లింక్ క్లిక్ చేయండి.
Updated : 14 Aug 2023 5:34 PM IST
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire