Home > ఆంధ్రప్రదేశ్ > Bandaru Satyanarayana: బండారుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు.. టీడీపీ సీరియస్

Bandaru Satyanarayana: బండారుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు.. టీడీపీ సీరియస్

Bandaru Satyanarayana: బండారుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు.. టీడీపీ సీరియస్
X

ఏపీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు నగరం పాలెం పోలీసు స్టేషన్ లో బండారు సత్యనారాయణపై 153 ఏ, 354ఏ, 504, 506, 509, 499 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులు, సెక్సువల్ ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా కించపరచడం, అల్లర్లు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం వంటి కేసుల్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

బండారు సత్యనారాయణ ఇంటిని ఆదివారం రాత్రే చుట్టుముట్టిన గుంటూరు పోలీసులు..అరెస్టు చేసి సోమవారం రాత్రి గుంటూరుకు తరలించారు. విశాఖ జిల్లా పరవాడలో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు 41A, 41B నోటీసులిచ్చి అరెస్టు చేశారు. బండారు సత్యనారాయణపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ను దూషించారని ఒక కేసు నమోదు కాగా, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి.. గుంటూరులోని అరండల్‌పేట, నగరపాలెంలో పీఎస్‌లో ఈ కేసులు నమోదయ్యాయి.

ఇక బండారు సత్యనారయణ అరెస్ట్ పై టీడీపీ సీరియస్ అయింది. 41A ఇచ్చిన వెంటనే 41B ఎలా ఇస్తారని టీడీపీ లీగల్ సెల్ అభ్యంతరం తెలిపింది. టీడీపీ మాజీ మంత్రి బండారు బెయిల్ పిటిషన్‌ను ఆయన న్యాయవాదులు సిద్దం చేశారు. మరోవైపు హైకోర్టులో నిన్న వేసిన హౌజ్ మోషన్ పిటిషన్.. రెగ్యులర్ కోర్టులో ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. నిన్న హౌస్ మోషన్ పిటిషన్ విచారించే సమయానికి 41A నోటీస్ ఇచ్చారన్న సమాచారంతో ఈరోజు విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక వాదనలు జరగనున్నాయి.

Updated : 3 Oct 2023 11:26 AM IST
Tags:    
Next Story
Share it
Top