Home > ఆంధ్రప్రదేశ్ > Anganwadi : అంగన్వాడీలతో ఏపీ సర్కార్ చర్చలు సఫలం

Anganwadi : అంగన్వాడీలతో ఏపీ సర్కార్ చర్చలు సఫలం

Anganwadi : అంగన్వాడీలతో ఏపీ సర్కార్ చర్చలు సఫలం
X

అంగన్వాడీలతో ఏపీ సర్కార్ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. తమ డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శ సుబ్బరావమ్మ తెలిపారు. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. తమ జీతాలు పెంపు జులైలో అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. నేటి నుంచి అంగన్వాడీలంతా విధులకు హాజరవుతున్నట్లు చెప్పారు. అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చుతామని మంత్రి బొత్స తెలిపారు. అంగన్వాడీల 13 డిమాండ్లలో 10 డిమాండ్లు నెరవేర్చామన్నారు. మిగతా డిమాండ్ల పరిష్కారం కోసం సీఎం జగన్ తో చర్చిస్తామని చెప్పారు.

అంగన్‌వాడీ టీచర్ రిటైర్మెంట్ బెనిఫిట్ ను రూ. 1.20 లక్షలకు పెంచామని చెప్పారు. హెల్పర్స్ కు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 60 వేలకు పెంచామని వివరించారు. ఉద్యోగ పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు నిర్ణయం తీసుకున్నామని, మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్‌వాడీలుగా మారుస్తామని మంత్రి తెలిపారు. చనిపోయిన అంగన్‌వాడీల మట్టిఖర్చుల కోసం రూ. 20 వేలు ఇస్తామన్నారు. రెండు దఫాలు అంగన్‌వాడీలతో చర్చలు జరిగాయని.. వారిపై నమోదైన కేసులను సీఎంతో చర్చించి ఎత్తివేస్తామని మంత్రి బొత్స తెలిపారు. సమ్మె కాలంపై ఏం చేయాలో సీఎంతో చర్చిస్తామన్నారు. సమ్మె విరమిస్తామని చెప్పినందుకు మంత్రి అంగన్వాడీలకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated : 23 Jan 2024 7:04 AM IST
Tags:    
Next Story
Share it
Top