Ganta Srinivasa rao:రెండేళ్ల కిందటి రాజీనామాకు.. ఇప్పుడు స్పీకర్ ఆమోదం
X
ఓ ఎమ్మెల్యే రెండేళ్ల కిందట తన పదవికి రాజీనామా చేయగా.. దాన్ని ఇప్పుడు స్పీకర్ ఆమోదించింది. ఈ వినూత్న ఘటన చోటుచేసుకుంది ఆంధ్రప్రదేశ్ లో. విశాఖపట్నం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రెండేళ్ల కిందట విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా తన పదవికి రాజీనామా చేశారు. కాగా ఎవరూ ఊహించని విధంగా ఆ రాజీనామాను ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదం తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీలో రానున్న నాలుగైదు నెలల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇవి పరోక్ష ఎన్నికలు కాగా.. ఈ టైంలో గంటా శ్రీనివాస్ రాజీనామాకు ఆమోదం తెలపడంలో వైసీపీ ప్రభుత్వ రాజకీయ వ్యూహమని జోరుగా ప్రచారం జరుగుతుంది.
కనకమేడల రవీంద్రకుమార్ (టీడీపీ), సీఎం రమేశ్ (బీజేపీ), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వైసీపీ) పదవీకాలం పూర్తికాబోతుంది. ఈ స్థానాలను భర్తీ చేసేందకు మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి షాకిచ్చేందుకు వైసీపీ స్కెచ్ వేసింది. ఎలక్షన్ నాటికి టీడీపీ ఎమ్మెల్యేల బలం తగ్గించేందుకు ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే గంటా శ్రీనివాస్ రాజీనామాకు ఇప్పుడు ఆమోదం తెలిపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంటుంది. రాజీనామా ఆమోదం తెలపడంతో గంటా రాజ్యసభ ఎలక్షన్స్ లో ఓటేసే అవకాశం కోల్పోయారు. దీంతో టీడీపీకి కూడా ఒక ఓటు తగ్గింది. కాగా ప్రస్తుతం వైసీపీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అయింది.